RGV: ఆహా.. రసిక రాజా.. చేతికి మల్లెపూలు.. అమ్మాయికి ముద్దు.. రచ్చ రచ్చ..!

Rgv Latest Post

సంచలన దర్శకుడు అన్న పేరు రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma)కు ఎలా వచ్చిందో కానీ.. ఆయన బయట కూడా ఏం చేసినా సంచలనమే. ఇటీవల మాత్రం ఆయన కాస్త మారారు అనుకున్నామా? తిరిగి ఆర్జీవీ (RGV) తన రోల్‌లోకి వచ్చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ చిన్నారిని కుక్కలు కరిస్తే.. ఆర్జీవీ స్పందించిన తీరుకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. మీరు మారిపోయారు సర్ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు. ఆ ఎపిసోడ్ అంతటితో ముగిసింది.

ఇక తాజాగా ఆర్జీవీ (RGV) ఈజ్ బ్యాక్. ఇప్పటి వరకూ అమ్మాయి కాళ్లను వదలకుండా వారి కాళ్ల దగ్గరే కూర్చొని హడావుడి చేస్తున్న వీడియోలు చాలానే చూశాం. తాజాగా వర్మ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘అమ్మాయిల కాళ్లే కాదు.. చేతులు కూడా’ అని ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో బ్లాక్ అండ్ క్రీం కలర్ టీ షర్ట్ వేసుకుని.. చేతికి మల్లెపూలు చుట్టుకుని ఒక అమ్మాయి చేతిని ముద్దాడుతున్నట్టుగా ఉందా ఫోటో. మొత్తానికి వర్మ (RGV)లోని రసికరాజా మరోసారి బయటకు వచ్చాడు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మామూలుగానే వర్మ పిక్ పోస్ట్ చేస్తే కామెంట్స్ బీభత్సంగా వస్తాయి. అలాంటిది ఇలాంటి ఫోటో వర్మ (RGV) సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా? కామెంట్స్‌తో దుమ్ము రేపుతున్నారు. ‘తెలివిలేనివాడు పాల గ్లాస్ తీసుకెళుతాడు.. తెలివి ఉన్నవాడు ‘వోడ్కా’ గ్లాస్ తీసుకెళుతాడు.. ఎంజాయ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ వర్మ ముద్దు పెడుతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో మాత్రం తెలియరాలేదు. ఇక ఈ ఫోటోకు లక్షల్లో వ్యూస్.. వేలల్లో లైక్స్ వస్తున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!