Kiraak RP: చేపల పులుసు బ్రాంచ్ ఓపెనింగ్‌లో పెళ్లి విషయాన్ని తేల్చిన కిర్రాక్ ఆర్పీ

Kiraak RP Marriage

జబర్దస్త్‌ (Jabardasth)లో ఉన్నంతకాలం కిర్రాక్ ఆర్పీ (Kiraak RP)గా పేరు తెచ్చుకున్న ఆర్పీ ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (Nellore Peddareddy Chepala Pulusu) ద్వారా తెగ ఫేమస్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం చేపల పులుసు ఆర్పీ(Kiraak RP)గా పేరు తెచ్చుకున్నాడు. ఇక మన ఆర్పీ(Kiraak RP)ని ఫేమస్ చేయడంలో యూట్యూబ్ ఛానల్స్ ప్రముఖ పాత్ర వహించాయని చెప్పాలి. ఆర్పీ (Kiraak RP) కర్రీ పాయింట్ క్రెడిట్ అంతా యూట్యూబ్ ఛానల్స్‌కే ఇవ్వాలి. మరోవైపు ఇంతలా పబ్లిసిటీ చేయడానికి ఆర్పీ యూట్యూబ్ ఛానల్స్‌కి ఎంత ముట్ట జెప్పాడోనన్న చర్చ కూడా బీభత్సంగానే నడుస్తోంది.

ఇప్పుడు ఆర్పీ (Kiraak RP) హవా మామూలుగా లేదు. పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్‌లను ఓపెన్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇటీవల కూకట్ పల్లి బ్రాంచ్ సూపర్ సక్సెస్ అవడంతో.. రెండు నెలలు తిరగకుండానే మణికొండలో మరో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. దాని ఓపెనింగ్ కోసం జబర్దస్త్‌ (Jabardasth)లో తనని విమర్శించిన వారందరిని ఆహ్వానించడం విశేషం. ఇక తాజాగా అమీర్ పేటలో మూడో బ్రాంచ్‌ని సైతం ఓపెన్ చేశాడు. తనకు కాబోయే భార్య లక్కీతో కలిసి ఓపెన్ చేయడం విశేషం. అంతా బాగానే ఉంది కానీ మరి పెళ్లెప్పుడని ఆర్పీ(Kiraak RP)ని నెటిజన్లు ప్రశ్నిస్తునన్నారు.

Kiraak RP Marriage

ఆర్పీ(Kiraak RP)కి లక్కీతో ఎప్పుడో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఫిబ్రవరిలో పెళ్లి అనుకున్నారు కానీ అది జరగలేదు. అదేమంటే చేపల పులుసు బ్రాంచ్‌ల ఓపెనింగ్ బిజీలో పెళ్లి వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నాడు ఆర్పీ. తన బిజినెస్ కారణంగా పెళ్లి కాస్త లేటు అవుతూ వస్తోందని.. ఇక వచ్చే నవంబర్‌లో మాత్రం పక్కాగా చేసుకుంటానని వెల్లడించాడు. నాలుగున్నరేళ్లు లక్కీని ప్రేమ కోసం కష్టపడ్డానని ఆర్పీ తెలిపాడు. ఇక తమ పెళ్లి నవంబర్‌లో ఉంటుందని అమీర్ పెట్ బ్రాంచ్ ఓపెనింగ్‌లో ఆర్పీ (Kiraak RP) తేల్చి చెప్పాడు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!