Venu Yeldandi: చిరు కాళ్లపై పడిపోయిన వేణు.. జీవితాంతం గుర్తుండిపోయే క్షణమంటూ ట్వీట్

Venu Jabardasth

ఇండస్ట్రీకి హాస్యనటుడిగా పరిచయమైన వేణు ఎల్దండి (Venu Yeldandi) ఇప్పుడు దర్శకుడిగా కూడా మారారు. జబర్దస్త్ (Jabardasth) ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వేణు (Venu Yeldandi) ‘బలగం’ సినిమాను డైరెక్ట్ చేసి హాట్ టాపిక్‌గా మారారు. సందేశం, ఎమోషన్స్‌, కుటుంబ సంబధాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చూశారు. ప్రస్తుతం చిరు (Chiranjeevi: భోళా శంకర్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ లొకేషన్‌కు వేణు ఎల్దండిని పిలింపించుకుని మరీ అభినందించారు. 

‘హాయ్ వేణు… కంగ్రాచ్యులేషన్స్! గుడ్ జాబ్’ అని వేణు(Venu Yeldandi)ని చిరంజీవి (Chiranjeevi) అభినందించారు. దీంతో ఆయన కాళ్ళ మీద పడి మరీ వేణు ఆశీర్వాదం తీసుకున్నారు. ‘కాదయ్యా… నువ్వు సినిమా ఇంత బాగా తీసి మాకు షాకులు ఇస్తే ఎలా చెప్పు?’ అని చిరు వేణు (Venu Yeldandi) తెగ మురిసిపోయారు. శాలువా కప్పి వేణు (Venu Yeldandi)ను చిరు సత్కరించారు. దీనికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వేణు (Venu Yeldandi) తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

వేణు ట్విటర్‌లో ‘‘ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు ఇది. నా బలగం విజయం రుణపడి ఉంటాను చిరంజీవి గారికి’’ అని పేర్కొన్నారు. బలం ఒక ట్రూ ఫిల్మ్ అని.. కమర్షియల్ ప్రొడ్యూసర్ రూపొందించినా కానీ సినిమాలో నిజాయితీ ఉందని చిరు పేర్కొన్నారు. సినిమాకు వేణు న్యాయం చేశాడన్నారు. మంచి నేటివిటీతో పాటు తెలంగాణ సంస్కృతి వంద శాతం చూపించాడని వేణు (Venu Yeldandi)ని చిరు కొనియాడారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!