Pawan Kalyan vs Mahesh Babu: సోషల్ మీడియాను కుదిపేస్తున్న పవన్ వర్సెస్ మహేష్ ఫ్యాన్ వార్

Pawan Kalyan

హీరోలంతా తాము సఖ్యంగానే ఉన్నట్టు సంకేతాలిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అయితే చెప్పనక్కర్లేదు.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. ఇక ఒకానొక స్టేజ్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సైతం తామంతా ఒక్కటిగానే ఉంటామని ఫ్యాన్స్ కొట్టుకోవద్దని చెప్పాడు. అయినా కూడా వినరే. వాళ్లంతా బాగానే ఉంటారు. మధ్యలో ఫ్యాన్స్‌కి వస్తుంది నొప్పి.

సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ (Pawan Kalyan Vs Mahesh Babu) మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. వీళ్లు వీళ్లు కొట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ ఏమీ తెలియని హీరోలను లాక్కొచ్చి వాళ్లను కమెడియన్స్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ చేసే రచ్చ సామాన్యులకు సైతం చిరాకు తెప్పిస్తోంది. అసలు మహేష్ (Mahesh Babu Fans) వర్సెస్ పవన్ ఫ్యాన్స్‌ (Pawan Kalyan Fans)కి ఏమైంది అంటారా?

Mahesh Babu, Pawan Kalyan

సంక్రాంతి -2022 బాక్సాఫీస్ బరిలో పవన్ – మహేష్ సినిమాలు పోటీపడనున్నాయి. నిజానికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి కానుకగా రాబోతున్నాయంటే మూవీ లవర్స్ సంబరపడి పోతుంటారు. ఇక వీరిద్దరి ఫ్యాన్సేమో కొట్టుకుంటున్నారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ (Pawan Kalyan Fans).. ఆయన బ్లాక్ టీ షర్ట్, ఆలివ్ గ్రీన్ ప్యాంట్‌తో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న పిక్స్‌ను వైరల్ చేశారు. అది చూసిన మహేష్ ఫ్యాన్స్ (Mahesh Babu Fans).. సరిలేరు నీకెవ్వరు మూవీలో ఆయన సైనికుడి పాత్రలో ఉన్న పిక్స్‌ను వైరల్ చేసి.. పవన్ ఫోటోకి ‘కిల్ బుల్ పాండే 2.0’ అంటూ బ్రహ్మానందం (Brahmanandam) ఫోటోను జత చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్‌కి మండిపోయింది. అంతే రచ్చ స్టార్ట్.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!