Sreeleela: టాలీవుడ్ ను దున్నేస్తున్న శ్రీలీల.. అమ్మడి చేతినిండా ప్రాజెక్టులే..

actress sreeleela

పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల (Sreeleela) ఫుల్లు బిజీగా మారిపోయింది. ఈ సినిమాలో హీరోగా చేసిన శ్రీకాంత్ తనయుడికి పెద్దగా అవకాశాలైతే రాలేదు కానీ ఈ నాజూకు బొమ్మకు మాత్రం అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. ‘పెళ్లి సందడి’ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ అమ్మడి (Sreeleela)కి మాత్రం యమ క్రేజ్ వచ్చింది. అమ్మడి క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ధమాకాలో ఏకంగా మాస్ మహరాజ్ రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో అమ్మడి నటన, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి.

Sreeleela in NBK108

ఇక ఆగుతుందా? ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసింది. ధమాకా విడుదలైన తర్వాత ఆమె ఏకంగా ఆరుకు పైగా చిత్రాలకు సైన్ చేసింది. ప్రస్తుతం చెప్పాలంటే తెలుగు చిత్రసీమలో విపరీతమైన డిమాండ్ ఉన్న ఏకైక బ్యూటీ శ్రీలీల (Sreeleela) అనే చెప్పాలి. ఆమె చాలా మంది చిత్రనిర్మాతలకు శ్రీలీలే (Sreeleela) ఫస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఆమె ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. రామ్, బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది.

Sreeleela

మరోవైపు నితిన్ (Nithiin) అప్ కమింగ్ మూవీలో సైతం శ్రీలీలే (Sreeleela) హీరోయిన్. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రంలో శ్రీలీల (Sreeleela) కూడా కీలక పాత్ర పోషిస్తోంది. హరీష్ శంకర్ (Harish Shankar) సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి జోడీగా నటిస్తోంది. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుత ప్రాజెక్ట్‌ల ప్రకారం శ్రీ లీల2024 చివరి వరకూ కూడా ఫుల్ బిజీ. అమ్మడి కాల్ షీట్లు ఇప్పుడప్పుడే దొరకడం కష్టమట. మరోవైపు ఈ ముద్దుగుమ్మ కన్నడలో కూడా రెండు సినిమాలు చేస్తోంది. మొత్తానికి చూస్తే.. శ్రీలీల (Sreeleela) టాలీవుడ్ ను దున్నేయబోతోందని, రానున్న రోజుల్లో స్టార్ హీరోయిన్ అయినా ఆశ్చర్య పడనక్కర్లేదని సినీ ప్రేమికులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: నరేష్ – పవిత్ర హనీమూన్‌కు ఎక్కడికెళ్లారంటే…!

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!