Naresh Pavitra: నరేష్ – పవిత్ర హనీమూన్‌కు ఎక్కడికెళ్లారంటే…!

Naresh, Pavitra Honerymoon

ఇప్పుడే సీనియర్ నటుడు నరేష్, పవిత్రల (Naresh, Pavitra) పెళ్లన్నారు.. అప్పుడే హనీమూన్ అంటున్నారేంటని టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి. ఇది అక్షరాలా నిజం. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరూ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. వీడియోను మాత్రం ఇవాళ రిలీజ్ చేశారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం దుబాయ్ (Dubai) చెక్కేశారు. అక్కడ ఈ జంట జాలీగా విహరిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకదాని వెంట ఒకటి వీడియోలు వస్తుండటంతో నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.

వివాహం తాలూకు వీడియోని సినిమాటిక్ స్టైల్లో తీయించుకున్నారు నరేష్, పవిత్రల (Naresh, Pavitra) జంట. దానిని నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ.. ఇట్లు మీ పవిత్రా నరేష్’’ అని పోస్ట్ పెట్టారు. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ఈ సడెన్ ట్విస్టేంటని ముక్కున వేలేసుకున్నారు. అంతలోనే ఈ హనీమూన్ వీడియోను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యంగ్ జంట మాదిరిగానే వీరిద్దరూ విహరించడం విశేషం.

Naresh, Pavitra wedding

కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట వివాహ బంధం ద్వారా ఒక్కటైంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య తమ వివాహం జరిగినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే వీరిద్దరూ సోషల్ మీడియాలో విడుదల చేస్తున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. వీరిపై ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. నిజానికి ట్రోలర్స్‌కి వీరే అవకాశం ఇస్తున్నారు. ఈ వయస్సులో నరేష్ (VK Naresh) నాలుగో పెళ్లి అనేది చాలా మందికి నచ్చడం లేదు. కానీ.. దాన్ని సోషల్ మీడియా వరకూ తెచ్చి, మీడియా ముందు రచ్చ చేసి ట్రోల్ చేసేలా చేసింది మాత్రం వారేనని నెటిజన్లు సైతం చెప్పుకొస్తున్నారు.

ఇదీ చదవండి: సడెన్‌గా పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర.. వీడియో విడుదల

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!