Sai Pallavi: ఇలా చేసినా కూడా మీటూ కిందకే వస్తుంది: సాయిపల్లవి

Sai Pallavi on Metoo

సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. స్టార్ హీరోలైతే ఓకే కానీ హీరోయిన్స్ విషయానికి వస్తే అంతగా ఏమీ బయటకు చెప్పరు. ఎందుకంటే ట్రోలర్స్ నోళ్లలో పడటం ఎందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. మాట్లాడాలని ఉన్నా కూడా నోరు నొక్కేసుకుంటారు. మరో భయం ఏంటంటే.. ఒకవేళ ట్రోలింగ్ బారిన పడితే అవకాశాలు ఎక్కడ సన్నగిల్లుతాయోనని భయపడి పోతూ ఉంటారు. అతి కొద్ది మంది మాత్రం.. ఎవ్వరినీ పట్టించుకోకుండా మనసులోది బయటకు కక్కేస్తారు.

వారిలో ఒకరు సాయిపల్లవి (Sai Pallavi). అమ్మడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొంత కాలానికే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ (Pushpa 2)లో సైంత ఓ నటించబోతున్నట్టు టాక్. సరే.. సినిమాల విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. తాజాగా ‘నిజం విత్ స్మిత’ (Nijam with Smitha) టాక్ షోలో ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. షోలోకి ఎంట్రీ ఇస్తూనే సాయి పల్లవి (Sai Pallavi) చేసిన సందడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: సడెన్‌గా పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర.. వీడియో విడుదల

Sai Pallavi

తనకు ఎన్టీఆర్ (NTR).. అల్లు అర్జున్ (Allu Arjun).. రామ్ చరణ్ (Ram Charan) లాంటి వాళ్ళతో డాన్స్ చేయాలని ఉందంటూ చెప్పి స్టార్ హీరోల అభిమానులను సాయిపల్లవి (Sai Pallavi) ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే స్మిత మీటూ ప్రస్తావన తీసుకొచ్చారు. ఒకప్పుడు మీటూ సంచలనం సృష్టించిందని.. దానిపై మీ అభిప్రాయం ఏంటని అని అడగ్గా.. సాయి పల్లవి (Sai Pallavi) ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘కేవలం శారీరకంగా టార్చర్ చేస్తేనే అది మీటూ వివాదం అవుతుందా..? మాటలతో గుచ్చి గుచ్చి మనిషిని క్షోభ పెట్టినా అది మీటూ(Me too) కిందకే వస్తుంది’ అంటూ సాయిపల్లవి (Sai Pallavi) బదులిచ్చింది. ఆమె ఆన్సర్‌కు సపోర్ట్ పెద్ద ఎత్తున లభిస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!