Raghavendra Rao: తమ్మారెడ్డి.. నీ దగ్గర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? : రాఘవేంద్రరావు డైరెక్ట్ కౌంటర్..!

Raghavendra Rao counter to Thammareddy Bharadwaja comments on RRR Movie

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై చేసిన కామెంట్స్‌కు సామాన్య ప్రజానీకం నుంచే కాకుండా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిన్న తమ్మారెడ్డి ఓ సందర్భంలో ‘‘‘ఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకి ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా టీం 80 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇప్పుడొచ్చే ఆస్కార్ (Oscar) కోసం ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా టీం ఫ్లైట్ టికెట్ల కోసమే 80 కోట్లు పైగా ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు ఇస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాం’’ అని పేర్కొన్నారు.

RRR movie

ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్స్ నామినేషన్‌ (Oscar Nominations)కు ఎంపికైంది. ఆస్కార్ (Oscar Awards) బరిలోకి ఒక తెలుగు సినిమా రావడంతో తెలుగు వారంతా ఒకవైపు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ తమ్మారెడ్డి (Thammareddy Bharadwaja) ఏంటి తన స్థాయిని మరచి మరీ వ్యాఖ్యలు చేశారు. ఏదో సామాన్యులు ఇలా వ్యాఖ్యలు చేశారంటే ఓకే కానీ.. సినిమా మేకర్స్ అయిన వాళ్లు కూడా మాట్లాడటం విడ్డూరమనే చెప్పుకోవాలి. ‘తమ్మారెడ్డి (Thammareddy Bharadwaja) వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ప్రముఖ దర్శకధీరుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) సైతం తమ్మారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గరేమైనా అకౌంట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. ‘‘తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికపై మొదటి సారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి. అంతే కానీ రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశ్యమా?’’ అని ట్విటర్ వేదికగా రాఘవేంద్రరావు (Raghanvendra Rao) ప్రశ్నించారు.

ఇదీ చదవండి: తమ్మారెడ్డికి నాగబాబు పచ్చి బూతులతో సమాధానం..!

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!