Naresh Pavitra Marriage: నరేష్ పెళ్లి అంతా తూచ్ అంట.. మీడియాతోనే ఆటలా..!

Naresh Pavitra Marriage

సీనియర్ నటుడు నరేష్ (Naresh) తన వివాహం పవిత్రా లోకేష్‌ (Pavitra Lokesh)తో జరిగిపోయిందంటూ నిన్నొక వీడియో విడుదల చేసి హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో వీడియో విడుదల చేసి తాము హనీమూన్ కోసం దుబాయ్ వచ్చామని కలరింగ్ ఇచ్చారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. లేటు వయసులో ఘాటు ప్రేమ ఏంటిరా బాబు? అని తలలు పట్టుకుంటున్న జనానికి ఆ మధ్య ఒక వీడియో విడుదల చేసి షాక్ ఇచ్చారు. అది పవిత్రా లోకేష్‌ (Pavitra Lokesh)ను లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న వీడియో.

ఈ వీడియోపై ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. తరువాత ఇదంతా తూచ్. తన బయోపిక్ కోసం అని ముక్తాయింపు ఇచ్చారు. ఇక ఇప్పుడు పెళ్లి, హనీమూన్ అంటూ హడావుడి చేస్తున్నారు. ఇది కూడా తూచేనని నెటిజన్లు అంటున్నారు. మీడియాతో నరేష్ (Naresh) ఆడుతున్న గేమ్స్ అని చర్చించుకుంటున్నారు. ఆయనే రిలీజ్ చేసి ఆపై తూచ్ అనడం కామన్ అయిపోయింది.

Naresh 3rd wife Ramya Raghupathi

అసలు మూడో భార్య రమ్య (Ramya Raghupathi)కు ఇంకా డివోర్స్ ఇవ్వలేదు.. కోర్టు భరణం ఇవ్వాలని చెప్పేసరికి నరేష్ వెనక్కి తగ్గారు. అలాంటప్పుడు పెళ్లి ఎలా సాధ్యమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

భరణం ఇవ్వకుంటే డివోర్స్ రావు. రాకుండా నరేష్ పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంటి..? అన్నీ ఆలోచించుకునే నరేష్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నరేష్ బయోగ్రఫీ తీస్తున్నారు అందులో భాగంగానే ఈ రచ్చ అని.. అంతకు మించి సీన్ లేదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ పెళ్లి (Naresh Pavitra Marriage) వీడియోను గమనించినా కూడా పెళ్లి తంతును జరిపించే పూజారి నుంచి పక్కనున్న అతిథుల వరకూ అంతా జూనియర్ ఆర్టిస్టులే. మరో టాక్ కూడా లేకపోలేదు. ఈ బయోపిక్ ముసుగులో పవిత్రా లోకేష్‌ను వివాహం చేసుకుని రమ్యకు భరణం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారనే చర్చ కూడా నడుస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!