Thammareddy: నాయమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు: నాగబాబుపై తమ్మారెడ్డి ఫైర్

Thammareddy Bharadwaja

ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఎవరెవరి కాళ్లు పట్టారో తనకు బాగా తెలుసని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) అన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) గురించి ఆయన చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత నాగబాబు (Nagababu), దర్శకధీరుడు రాఘవేంద్రరావు (Director Raghavendra Rao) ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. నాగబాబు అయితే ఏకంగా వైసీపీ భాషలోనే రిప్లై అంటూ ఘాటుగా విమర్శించారు. చాలా మంది నెటిజన్ల నుంచి నాగబాబు (Nagababu)కు ఈ విషయంలో మద్దతు కూడా లభించింది.

ఇక రాఘవేంద్రరావు (Raghavendra Rao) సైతం తమ్మారెడ్డి (Thammareddy Bharadwaja) వ్యాఖ్యలను ఖండించారు. ఆర్ఆర్ఆర్ టీం (RRR Team) ఆస్కార్ (Oscar) ఫ్లైట్ టికెట్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారనడానికి నీ దగ్గర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశ్యమా? అని తమ్మారెడ్డిని ట్విటర్ వేదికగా కడిగి పారేశారు. దీంతో తమ్మారెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టున్నారు.

Nagababu counter to Thammareddy Bharadwaja

ఏపీ సీఎం జగన్ చేసే మంచి పనుల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నాగబాబు (Nagababu), రాఘవేంద్రరావు (Raghavendra Rao(లకు కడుపు మంట అని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ఇండస్ట్రీ అంటే నాకు తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తాను కాబట్టి.. నేనెప్పుడూ ఏదీ మాట్లాడను. నేను ఈ రోజుకీ సంయమనం పాటించి మర్యాదగా మాట్లాడుతుంటే.. ఎవడిష్టం వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. నీయమ్మ మొగుడు అంటాడొకడు.. నాయమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు. సంస్కారం నేర్పించాడు. నాకు నీతిగా బతకడం నేర్పించాడు. నిజం చెప్పి నిజంగా బతకడం నేర్పించాడు. మీకు నేర్పించారా? మీకు తెలుసా? నిజమే చెప్పగలరా? కులాలు, మతాలంటూ తిట్టే మీరా నా గురించి మాట్లాడేవాళ్లు?’’ అంటూ ఫైర్ తమ్మారెడ్డి (Thammareddy Bharadwaja) అయ్యారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!