Prabhas Kriti Sanon: ప్రభాస్‌తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన కృతి సనన్..

Kriti Sanon Prabhas

ప్రభాస్, కృతి సనన్‌ (Prabhas Kriti Sanon)లు డేటింగ్‌లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ప్రారంభమైంది మొదలు.. వీరిద్దరి రిలేషన్‌పై రకరకాల కథనాలు, ఊహాగానాలు సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) ఆమెను ఏకంగా వదినమ్మ అని పిలవడం సైతం మొదలు పెట్టారు. అయితే ఇప్పటి వరకూ వీరిద్దరి నుంచి పెద్దగా క్లారిటీ అయితే రాలేదు.

ఇన్నాళ్లకు కృతి సనన్ (Kriti Sanon) క్లారిటీ ఇచ్చేసింది. తమ రిలేషన్‌షిప్ గురించి ప్రచారం అవుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టేసింది. తనకూ, ప్రభాస్‌ (Prabhas)కూ ఏదో ఉందని అందరూ అంటుంటే తాను చాలా బాధ పడ్డానని.. చివరకు బాలీవుడ్ ప్రముఖుడు వరుణ్ ధావన్ (Varun Dhavan) సైతం ఇలాంటి కామెంటే చేశాడని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ప్రభాస్‌తో చెప్పుకుని బాధపడ్డానని కృతి సనన్ (Kriri Sanon) ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Kriti Sanon Prabhas 2

అయితే తనను ఎవరితో ముడి పెట్టి అయితే కామెంట్ చేస్తున్నారో వారికే చెప్పుకుని కృతి బాధపడటం ఏంటనేది అర్ధం కాలేదు. అసలు తను ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని భయపడుతూనే అడుగు పెట్టానని.. తాను భయపడిందంతా అయ్యిందని కృతి చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇకనైనా మా మధ్య ఏవేవో రిలేషన్స్ అంటగట్టడం ఆపేయని.. డైరెక్ట్‌గానో ఇన్‌డైరెక్ట్‌గానో కృతి (Kriti Sanon) చెప్పేసింది. మరి నెటిజన్లు దీనికి అర్ధాలు.. పరమార్థాలు వెదుకుతారో చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!