Vishnu Priya: ఆ సమయంలో డబ్బు లేక సరిగా తిండి తినే దాన్ని కాదు: యాంకర్ విష్ణు ప్రియ

Vishnu Priya: ఆ సమయంలో డబ్బు లేక సరిగా తిండి తినే దాన్ని కాదు: యాంకర్ విష్ణు ప్రియ

బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ(Vishnu Priya) గురించి తెలియని వారుండరు. 2015లోనే ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఆమెకు గుర్తింపు మాత్రం పోవే-పోరా ప్రోగ్రాంతోనే వచ్చింది. సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer)తో కలిసి చేసిన ఈ షో మంచి సక్సెస్ అయ్యింది. ఇటీవలి కాలంలో అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది. విష్ణు ప్రియ(Vishnu Priya) హీరోయిన్‌గా సైతం నటించిందని అతి తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. 2016లో ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’తో పాటు 2020లో ‘చెక్ మేట్’అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే విష్ణు ప్రియ(Vishnu Priya) తాజాగా మానస్‌(Manas)తో కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక తాజాగా కూడా గంగులు అనే సాంగ్‌లో రెచ్చిపోయి మరీ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా విష్ణు(Vishnu Priya).. మై విలేజ్ షో వారితో కలిసి దావత్ చేసుకుంది. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Vishnu Priya: ఆ సమయంలో డబ్బు లేక సరిగా తిండి తినే దాన్ని కాదు: యాంకర్ విష్ణు ప్రియ

తన మూడేళ్ల వయసులో తమ తల్లిదండ్రులు చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారని.. తనకు పోవే పోరాతో బ్రేక్ వచ్చిందని వెల్లడించింది. అదే సమయంలో నంబర్ 1 యారీలో కూడా అవకాశం వచ్చిందని వెల్లడించింది. నంబర్ వన్ యారీలో తాను చాలా సన్నగా కనిపించానని.. ఆ సమయంలో డబ్బు లేక సరిగా తిండి తినే దాన్ని కాదని తెలిపింది.

తన తల్లి శ్రియ, ఆర్తి అగర్వాల్‌కు హెయిర్ డ్రస్సర్‌గా పని చేసిందని తెలిపింది. నిజానికి తన తల్లి భరత నాట్యం బాగా చేస్తుందని.. అంతటి టాలెంట్ ఉన్న ఆమె హెయిర్ డ్రస్సర్‌గా పని చేయడం తనను కలచి వేసిందని తెలిపింది. తన తల్లి గురించి ఎవరైనా మాట్లాడుకుంటే యాక్టర్ వాళ్ల మమ్మీ అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతో తాను చాలా కష్టపడ్డానని వెల్లడించింది. తన తల్లి ఈ జనవరిలో మరణించిందని విష్ణు ప్రియ(Vishnu Priya) తెలిపింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!