Gopichand – Teja: గోపీచంద్.. నాన్న గొప్పోడు.. మరి నువ్వేం పీకావ్..!

Gopichand - Teja: గోపీచంద్.. నాన్న గొప్పోడు.. మరి నువ్వేం పీకావ్..!

టాలీవుడ్​లో మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో గోపీచంద్(Gopichand) ఒకరు. విలన్‌గా తన ప్రస్థానం మొదలు పెట్టి హీరోగా మారిన వారిలో కూడా గోపీచంద్ ఒకరు. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్‌ను ఎంచుకుని మరీ సినిమాలు చేస్తుంటాడు.

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో కూడా పెద్దగా సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. దర్శకుడు శ్రీవాస్‌(Sriwass)తో లక్ష్యం, లౌక్యం అంటూ రెండు సినిమాలు చేసిన గోపిచంద్.. తాజాగా ముచ్చటగా మూడో సినిమా కూడా చేశాడు.

గోపిచంద్(Gopichand), శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం అనే సినిమా రూపొందింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో డింపుల్ హయతీ హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ని జోరుగా నిర్వహిస్తోంది. తన సినిమా ప్రమోషన్స్ కోసం ఈసారి గోపిచంద్(Gopichand) డైరెక్టర్ తేజా(Director Teja)తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. వీరిద్దరికీ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ప్రోమోలో తేజ(Teja) అడిగిన ఆసక్తికర ప్రశ్నలను హైలైట్ చేశారు. సమాధానాలను మాత్రం షో చూసి తెలుసుకోవాల్సిందే. ‘రామబాణం’(Ramabanam) చిత్రం పేరును నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) అనౌన్స్ చేశారు. బాలయ్య చేత ఎందుకు అనౌన్స్ చేయించారని గోపిచంద్‌ను తేజా ప్రశ్నించారు. తనతో సినిమా ఆగిపోయినప్పుడు.. వేరే ప్రాజెక్టును మొదలు పెట్టడమేంటని తేజ ప్రశ్నించారు. అలాగే తన ఫోన్ ఎత్తలేదని ఫైర్ అయ్యారు. మీ నాన్న గొప్పోడు.. మరి నువ్వేం పీకావని గోపీచంద్‌(Gopichand)ను తేజ ప్రశ్నించారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!