Pushpa2: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 అప్పటికి కష్టమేనట..

Pushpa2: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 అప్పటికి కష్టమేనట..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే పుష్ప 2పై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఇక దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు యత్నిస్తున్నారు.

రీసెంట్‌గా సుక్కు సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వదిలారు. ఇది ప్రేక్షకుల్లో సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచేసింది. హిందీలో సైతం ఈ సినిమాకు హ్యూజ్ మార్కెట్ ఏర్పడింది.

మొత్తానికి పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ విషయంలో మొన్నటి వరకు ఒక క్లారిటీ ఉండేది. కానీ సుక్కతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడంతో సినిమా రిలీజ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. మొత్తానికి సినిమా యూనిట్‌ని ఈ దాడులు చాలా డిస్టర్బ్ చేశాయని సమాచారం. దీంతో పుష్ప 2 అనుకున్న సమయానికి విడుదలవుతుందా? అనేది సందేహంగా మారింది.

Pushpa 2

నిజానికి పుష్ప 2 ని సుక్కు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా దాదాపుగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి గానీ లేదంటే సమ్మర్ కారనుకగా గానీ విడుదల చేయాలనుకున్నారు. కానీ ఐటీ దాడులతో చిత్ర దర్శక, నిర్మాతలు కొంత షాక్‌లో ఉన్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే షూటింగ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 సంక్రాంతికి కష్టమేనని అంతా అనుకుంటున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!