Ugram Review: అల్లరి నరేశ్‌కు ఉగ్రం సినిమా కలిసొచ్చినట్టేనా? ప్రేక్షకులు ఏమంటున్నారు?
అల్లరి నరేశ్(Allari Naresh) ఈ మధ్య కామెడీకి ఫుల్ స్టాప్ పెట్టి యాక్షన్, థ్రిల్లర్ సినిమాలపై ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాంది సినిమాలో నటించిన సక్సెస్ అయిన అల్లరి నరేశ్ తాజాగా ఉగ్రం(Ugram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల, అల్లరి నరేశ్(Allari Naresh) కాంబోలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లరి నరేశ్‌కి ఈ సినిమా ప్లస్సా? మైనస్సా? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం.
అల్లరి నరేశ్(Allari Naresh) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీశాడనే ప్రేక్షకులు చెబుతున్నారు. ఆయన నేరస్థులను పట్టుకుని ఉతికి ఆరేస్తుంటాడు. ఈ క్రమంలోనే నరేశ్ భార్యను లైంగికంగా హింసిస్తామని హంతకులు అతనికి వార్నింగ్ ఇస్తారు. దీంతో నేరస్థుల్లో ముగ్గురిని చంపేస్తాడు. కానీ సడెన్‌గా అల్లరి నరేశ్ భార్య, కూతురు కనిపించకుండా పోతారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. వారినెవరు కిడ్నాప్ చేశారు? చివరకు వారిని ఎలా కనిపెట్టాడు? అనే అంశాలు సినిమా చూసి తెలుసుకోవాల్సింది.
ఇక నరేష్(Allari Naresh) నటనకు అయితే మంచి మార్కులే పడుతున్నాయి కానీ ఇక్కడ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని నెటిజన్లు అంటున్నారు. పాటలు సైతం ఆకట్టుకోలేకపోయాయంటున్నారు. కొన్ని చోట్ల పాటలే సినిమాకు మైనస్ అని చెబుతున్నారు. కథకు తగ్గ స్క్రీన్‌ప్లే లేదని అంటున్నారు. కొన్ని సీన్లు చాలా రొటీన్‌గా అనిపించాయి. మొత్తానికి కథలో కొత్తదనం అయితే ఏమీ లేదు. బీజీఎం మాత్రం బాగుందంటున్నారు. సెకండాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి సినిమా పర్వాలేదన్న టాకే ఎక్కువగా వినిపిస్తోంది.