Mahesh Babu SSMB28: సినిమా పక్కా బ్లాక్ బస్టరేనట.. మహేష్ ఆ స్టిల్ చూసి కాలరెగరేస్తున్న ఫ్యాన్స్..

Mahesh Babu SSMB Release date

సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu)ని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఎప్పుడూ ఎక్కడా కూడా ఇన్‌డీసెంట్‌గా కనిపించడు. తన పని ఏదో చూసేసుకుని వెళ్లిపోతుంటాడు. అలాంటి మహేష్ ఒకప్పుడు చైన్ స్మోకర్ అన్న విషయం తెలిసే ఉంటుంది. రోజుకు నాలుగు పెట్టెల సిగిరెట్లు ఊదేసే వాడట. ఆ తర్వాత ఒక బుక్ చదివానని.. అది చదివాక తనకు సిగిరెట్లు అంటే విరక్తి పుట్టిందని మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తరువాత ఇక అసలు సిగిరెట్లు ముట్టలేదని వెల్లడించాడు.

అంతేకాదు.. కనీసం సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాలకు తావివ్వనని మహేష్ (Mahesh Babu) తెలిపాడు. చెప్పిన మాట ప్రకారమే ఇప్పటి వరకూ సిగిరెట్ సన్నివేశాలను కూడా తన సినిమాల్లో పెట్టలేదు. అలాంటిది మహేష్ తాజా పోస్టర్ ఒకటి చూసి అభిమానులు షాక్ అయ్యారు. నేడు SSMB28 మహేష్ – త్రివిక్రమ్ (Mahesh Babu – Trivikram Srinivas) కాంబో మూవీకి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదలైంది. దానిలో మహేష్ సిగరెట్ కొడుతూ స్టైల్‌గా నడుచుకుంటూ వెళుతున్న ఫోటోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Mahesh Babu SSMB Release date announced

ఆ పోస్టర్‌ (SSMB28) పై సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. జనవరి 13 న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపింది. అయితే విడుదల తేదీని చూసి ఆనందించాలో.. సిగిరెట్ ముట్టనని మాట ఇచ్చి తప్పినందుకు బాధపడాలో తెలియక ఫ్యాన్స్ సతమతమవుతున్నారు. అయితే క్యారెక్టర్ డిమాండ్ చేసి ఉంటుంది. అందుకే మహేష్‌(Mahesh Babu)కి తప్పలేదంటూ కొందరు ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు. ఇది పక్కనపెడితే మహేష్ సిగిరెట్ తాగే సీన్ ఉంటే అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందట. ఒక్కడు, పోకిరీలే దీనికి నిదర్శనమని ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్‌ అని ఫ్యాన్స్ అప్పుడే కాలర్ ఎగరేయడం స్టార్ట్ చేశారు.

ఆ బుక్ మహేష్ జీవితాన్ని మార్చేసింది.. అదే లేకుంటే.. బాబోయ్..!

‘అమరావతికి అటు ఇటు’.. ఏంటిది? మహేష్ ఏంటి ఈ పొలిటిక్స్ ఏంటి?

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!