Sekhar Master: శేఖర్ మాస్టర్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..
కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (Rakesh Master) వద్ద డ్యాన్స్‌లో మెరుగులు దిద్దుకోవడం కోసం చేరి గురువును మించిన శిష్యుడిగా శేఖర్ మాస్టర్(Sekhar Master) ఎదిగారు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ కొరియోగ్రాఫర్స్‌లో ఆయన ఒకరు. స్టార్ హీరోలందరికీ ప్రస్తుతం ఆయనే కొరియోగ్రాఫర్. ఇప్పుడు శేఖర్ మాస్టర్(Sekhar Master) అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై తన హవా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, శాండల్‌వుడ్.. చివరకి బాలీవుడ్లో కూడా అడుగు పెట్టేశారు.
ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ప్రభు దేవా(Prabhu Deva), లారెన్స్(Lawrencce) రేంజ్‌కి ఎదిగారు శేఖర్ మాస్టర్(Sekhar Master). అటు ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోకి సైతం ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి శేఖర్ మాస్టర్(Sekhar Master) రెండు చేతులా బీభత్సంగా సంపాదించేస్తున్నారు. ఆయన కూతురు, కుమారుడు సైతం స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్‌కి బీభత్సమైన క్రేజ్ ఉంది. తాజాగా శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శేఖర్ మాస్టర్(Sekhar Master) ఒక్కో పాటకు తీసుకునే రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆయన ఒక్కో పాటకి 5 నుంచి 10 లక్షల రూపాయిల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్. ఒక సినిమాకి ఐదు నుంచి ఆరు పాటలుంటాయి. వాటన్నింటికీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తే 30 నుంచి 40 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ వస్తుంది. ఇక ఏడాది ఆయన చేసే సినిమాల సంఖ్య చాలా పెద్దది. కనీసం 12 నుంచి 15 సినిమాల వరకు చేస్తారని టాక్. ఈ లెక్కన శేఖర్ మాస్టర్(Sekhar Master) నెల సంపాదన రూ. 4 నుంచి 5 కోట్లు ఉంటుందని సమాచారం.