Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

బిగ్‌బాస్ నాలుగోవారం నామినేషన్స్ ముగిశాయి. నామినేషన్స్ అంటేనే రచ్చ. మొత్తానికి రచ్చ బీభత్సంగానే నడిచింది. ఈ నామినేషన్స్‌లో ముఖ్యంగా హైలైట్ అయ్యింది శుభశ్రీ. అదిరిపోయే లాజిక్స్‌తో రతికను ఇరుకున పడేసింది. రతిక సమర్థించుకునేందుకు ఎంత ట్రై చేసినా కూడా వర్కవుట్ కాలేదు. అయితే ఈ నామినేషన్స్ వ్యవహారం ఎప్పటి మాదిరిగానే హాట్ హాట్‌గా నడిచాయి. బీభత్సంగా గొడవలు కూడా జరిగాయి.

ఇవన్నీ ఏమో కానీ రతికను పల్లవి ప్రశాంత్ అక్క అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి రతిక ప్రశాంత్‌ను ఏదో ఒకరకంగా కవ్విస్తూనే ఉంది. పైగా అతనే తన వెంట పడ్డాడంటూ కలరింగ్ ఇచ్చింది. ప్లేటు ఫిరాయించి అతని క్యారెక్టర్‌పైనే ఓ బ్యాడ్ రిమార్క్ వేసేసింది. ఆ తరువాత పల్లవి ప్రశాంత్‌ను వదిలి యావర్‌ను పట్టుకుంది. మొత్తానికి ఈమె బిగ్‌బాస్ ‘బేబి’లా మారిపోయింది.

ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

మొత్తానిక ప్రశాంత్ కొద్ది రోజుల క్రితమే ఆమె నిజస్వరూపం తెలుసుకున్నాడు. యావర్‌ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా రతికను ఏకంగా అక్క అని పిలవడం ఆసక్తిని రేకెత్తించింది. గత వారం తన ఆడలేక సైడ్ అయిపోయానని, మళ్లీ అదే విషయాన్ని ఎత్తిచూపినందుకు శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్లు అమర్ దీప్ చెప్పాడు. దీంతో ఆమె బాగా ఫీల్ అయిపోయింది. తప్పు కారణానికి తనని నామినేట్ చేశారని.. అదొక కారణమా.. సిల్లీయెస్ట్ రీజన్.. ఛీ అని అమరదీప్‌తోనే సీరియస్‌గా అనేసింది. నిజానికి అమర్‌దీప్ చాలా సిల్లీ రీజన్ చెప్పాడు.

ఇవీ చదవండి:

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

Google News