ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన మూవీ ‘బాహుబలి’. ఈ సినిమాతో ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా బాహుబలి మూవీలో ప్రభాస్ లుక్ విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రభాస్ హైట్.. దానికి తగ్గ ఫిజిక్‌తో బాహుబలి గెటప్‌లో ప్రభాస్ అదిరిపోయాడు. నిజానికి ఆ గెటప్‌కు ప్రభాస్ మాత్రమే సూట్ అవుతాడని అనిపించింది 

బాహుబలి గెటప్ ఎంతలా ఫేమస్ అయ్యిందంటే.. బ్యాంకాక్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మను సైతం ఈ గెటప్‌లోనే ఏర్పాటు చేయడం విశేషం. ఈ మైనపు బొమ్మను చూస్తుంటే అచ్చుగుద్దినట్టుగా ప్రభాస్‌ను చూస్తున్నట్టే ఉంటుంది. అయితే తాజాగా ఈ బాహుబలి గెటప్‌లోనే మరో మైనపు విగ్రహం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

ఇక ఈ మైనపు విగ్రహాన్ని మైసూర్‌లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం మైసూర్ వాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ స్టాట్యూ బాహుబలి గెటప్‌లో ఉంది కానీ ప్రభాస్ పోలిక మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రభాస్ పరువు తీయొద్దు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వెంటనే ఈ విగ్రహాన్ని తొలగించి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

అయ్యో పాపం నరేష్.. పెళ్లి తెచ్చిన తిప్పలు..!

Google News