ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రియమణి అనగానే గుర్తొచ్చే మూవీ యమదొంగ. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, ప్రియమణిల జంట కూడా చాలా బాగుందనే టాక్ నడిచింది. ఇక ప్రస్తుతం తారక్.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘దేవర’ చేస్తున్నాడు. ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ అయితే నడుస్తోంది.

అయితే ‘దేవర’ మూవీ గురించి.. అలాగే ఎన్టీఆర్, ప్రియమణిల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో తారక్‌కు తల్లిగా ప్రియమణి నటిస్తోందంటూ సోషల్ మీడియాలో బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. గతంలో తనకు జంటగా నటించిన ప్రియమణిని తల్లిగా ఎన్టీఆర్ ఎలా అంగీకరించాడని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Advertisement
ntr in devara

అసలు ఈ న్యూస్ ఎంతవరకు నిజమని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి పని చేయవద్దని సూచనలు చేస్తున్నారు. ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై ప్రియమణి కూడా ఇప్పటి వరకూ స్పందించింది లేదు. గతంలో కూడా అల్లు అర్జున్ పుష్ప 2లో ఓ కీలక పాత్రలో ప్రియమణి నటిస్తోందంటూ ప్రచారం జరిగింది. ఈ విషయం ఆమె దృష్టికి వెళ్లిన వెంటనే ఆమె ఖండించారు. మరీ ‘దేవర’ మూవీ విషయం ప్రియమణి దృష్టికి వెళ్లలేదా? లేదంటే ఎన్టీఆర్‌కు తల్లిగా నటిస్తోంది నిజమేనా? అర్ధం కాక ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.

ఇవీ చదవండి:

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..