Keerthy Suresh: ‘దసరా’ చిత్ర యూనిట్‌కి 130 బంగారు నాణేలను గిఫ్ట్‌గా ఇచ్చిన కీర్తి సురేష్!

Keerthy Suresh gifts 130 Gold coins to Dasara Unit

నాని (Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా నటిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara). ఈ సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ‘చమ్కీల అంగీలోడే’ (Chamkeela Angeelode)సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇక దీనికి లెక్కలేనంత మంది రీల్స్ చేశారు. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే ముందుగా మనకు కనిపించేది ఈ సాంగే కావడం విశేషం. అంతలా పాపులర్ అయిపోయింది. మరి సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Dasara Chamkila Angilesi song

ఇక ఈ సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) గురించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ షూటింగ్ చివరి రోజు చిత్ర సిబ్బందికి 130 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చిందని టాక్. బంగారు నాణేల విలువ రూ. 70 లక్షలని సమాచారం. చిత్ర షూటింగ్‌లో పని చేసిన డ్రైవర్లు, లైట్ బాయ్స్‌తో సహా 130 సిబ్బందికి కీర్తి బంగారు నాణేలను ఇచ్చిందట. దసరా (Dasara Movie) మూవీలో కీర్తి.. వెన్నెల అనే పాత్రను పోషిస్తోంది.

Nani in Dasara Movie

తెలంగాణ (Telangana)లోని గోదావరి ఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో దసరా మూవీ (Dasara Movie) తెరకెక్కింది. ఇటీవలి కాలంలో నానికి మంచి హిట్ అనేదే లేదు. ప్రస్తుతం నాని (Nani) ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడుతూ సైతం నాని.. తన కెరీర్‌కు ఈ సినిమా ప్లస్ అవుతుందనే ఆశా భావాన్ని వ్యక్తపరిచాడు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు అయితే నిరాశ చెందరని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

Chamkeela Angeelesi: సోషల్ మీడియా.. ఇండస్ట్రీనీ షేక్ చేస్తున్న చమ్కీల అంగీలేసి’ సింగర్ ఎవరో తెలిస్తే…!

‘దసరా’ కు కరణ్ జోహార్ సాయం తీసుకోకపోవడం వెనుక..!

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!