Mohan Babu: మౌనికతో మనోజ్‌ పెళ్లి మోహన్‌బాబుకు ఇష్టం లేదట.. అందుకే ఇలా..!

Manchu Manoj, Mounika Mohan Babu
Manchu Manoj, Mounika, Mohan Babu

ఈ మధ్య మంచు ఫ్యామిలీ(Manchu family) తెగ వార్తల్లో నిలుస్తోంది. మంచు మనోజ్ (Manchu Manoj) రెండవ వివాహం గురించి అనుకున్నప్పటి నుంచి కూడా ఈ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి మంచు లక్ష్మి ఇంట కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య సింపుల్‌గా జరిగిపోయింది. మంచు విష్ణు సైతం ఈ పెళ్లికి గెస్ట్‌గా రావడం విశేషం. కేవలం 15 నిమిషాలు ఉండి వెళ్లిపోయాడు.

మరోవైపు మంచు మోహన్ బాబు (Mohan Babu) సైతం ఈ పెళ్లికి రారంటూ తొలుత ప్రచారం జరిగింది. కానీ మోహన్‌బాబు దగ్గరుండి మరీ కుమారుడి వివాహం జరిపించారు. ఈ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. వాటికి ఇప్పటి వరకూ మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ సమాధానం చెప్పలేదు. కానీ ముఖ్యంగా తండ్రీకొడుకుల గురించి న్యూస్ తెగ వైరల్ అయ్యింది. మోహన్‌బాబు (Mohan Babu)కు ఈ పెళ్లి ఇష్టం లేదని.. ఈ క్రమంలోనే గొడవలు కూడా అయ్యాయని.. అందుకే మనోజ్ (Manchu Manoj) తండ్రి ఇంటి నుంచి విడిపోయి సెపరేట్‌గా ఉంటున్నాడని ప్రచారం జరిగింది.

Manchu Manoj Wedding

తాజాగా మోహన్‌బాబు (Mohan Babu) తన కుమారుడి వివాహంపై స్పందించారు. తనకు మనోజ్.. మౌనికారెడ్డితో ప్రేమలో ఉన్నాడని చాలా కాలం క్రితమే చెప్పాడన్నారు. పెళ్లి చేసుకోబోతున్నానని ఇటీవల చెబితే.. ఒకసారి ఆలోచించుకో అని చెప్పానని.. కానీ మనోజ్ (Manchu Manoj) ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని.. ఆ అమ్మాయి తనకు కరెక్ట్ అనిపించిందని చెప్పాడని మోహన్‌బాబు (Mohan Babu) తెలిపారు. అప్పటికే నిర్ణయం తీసేసుకున్నానని చెప్పడంతో సరే తన ఇష్టం.. అల్ ది బెస్ట్ చేసేసుకో అన్నానని వెల్లడించారు. ఇక సోషల్ మీడియా లో వచ్చే న్యూస్, ట్రోలింగ్స్‌ని తానసలు ఫాలో అవ్వనని.. ఎవరైనా చెబితే విని ఊరుకుంటానని మోహన్ బాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: మంచు ఫ్యామిలీలో గొడవ.. రచ్చకెక్కిన విష్ణు, మనోజ్‌ల వ్యవహారం

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!