వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

ఒక సినిమాకు ఒక్కో సీన్ హైలైట్ అవుతూ ఉంటుంది. దాని కోసం దర్శక నిర్మాతలు పెట్టే ఎఫర్ట్.. ఖర్చు సీన్‌ను ఓ రేంజ్‌లో నిలబెట్టేలా చేస్తుంది. తాజాగా విడుదలైన ‘స్కంద’ మూవీలో ఒక సీన్ హైలైట్ అయ్యింది. అది తెలంగాణ సదరన్ వేడుకకి సంబందించిన సీన్ కావడంతో దాని కోసం ఒక దున్నపోతును దర్శకుడు బోయపాటి వాడారు. ఆ దున్నపోతు గురించి ఇప్పుడు బీభత్సంగా టాక్ నడుస్తోంది.

ఆ దున్నపోతు పేరు యువరాజు. పేరుకు తగ్గట్టుగానే యువరాజులా అనిపించింది. చూడటానికి చాలా పెద్దగా.. ఎత్తుగా ఉంది. నిజానికి ఆ దున్నపోతు టీజర్‌లో కనిపించినప్పటి నుంచే హాట్ టాపిక్ అయిపోయింది. ఇక సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు దాని గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆరా తీస్తున్న కొద్దీ దున్నపోతు గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు దగ్గర యువరాజు ఉంది.

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

ఆ రైతే దానికి ముద్దుగా యువరాజు అని పేరు పెట్టుకున్నారు. ఆసియాలోనే అత్యంత పెద్ద దున్నపోతు అని టాక్. 5.8 అడుగుల ఎత్తు.. 11.5 అడుగుల పొడవుతో అద్భుతంగా ఉంది. ఇక దీని ఖరీదు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా రూ.9 కోట్ల 25 లక్షలు. షాకింగ్ కదా. అయితే ఆసియాలో పెద్దది కాబట్టి అంత ఖరీదు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇది నెలకు రూ.50 లక్షల వరకూ సంపాదిస్తుందట. ఇక ఆ రైతు దానిని అమ్మేందుకు కూడా సాహసించడం లేదట. బోయపాటి ఒక్కో సీన్‌కి రూ.26 లక్షలు ఇచ్చారని టాక్.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

Google News