ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొద్ది రోజుల క్రితం యూరప్‌కు వెళ్లారు. దీనికి సంబంధించి తాజా అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత కొన్ని నెలలుగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన యూరప్‌లో సర్జరీ చేయించుకున్నారని సమాచారం. బాహుబలి షూటింగ్ సమయంలో యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా ఆయన మోకాలికి గాయమైనట్టు తెలుస్తోంది. 

అప్పటి నుంచి ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యులు సర్జరీ తప్పనిసరి అని చెప్పడంతో సలార్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఇతర సినిమాల షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేసి యూరప్‌కి వెళ్లాడు. సర్జరీ అయితే పూర్తైంది. వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ప్రభాస్ యూరప్‌లోనే ఉండిపోయారు. నవంబర్ లో ఆయన షూటింగ్స్‌లో తిరిగి జాయిన్ అవుతారని తెలుస్తోంది.

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

సలార్ షూటింగ్ తో పాటు డబ్బింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలను ప్రభాస్ పూర్తి చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ లేటు కావడంతో సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే తిరిగి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి 2898 AD , రాజా డీలక్స్ సినిమాలు ఉన్నాయి. యూరప్ నుంచి రాగానే వీటి షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం.

ఇవీ చదవండి:

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

Google News