‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు తన హవాను కొనసాగిస్తున్నాయి. బేబి కూడా చిన్న సినిమాగానే వచ్చి మంచి హిట్ సాధించింది. నేడు మరో చిన్న సినిమా విడుదలైంది. పెదకాపు 1 అనే టైటిల్‌తో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. దీనిని చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా ఎలాంటి రివ్యూ ఇస్తున్నారో చూద్దాం.

 విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటించిన ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు అంతగా మెప్పించలేదు కానీ ఓవరాల్‌గా సినిమా మంచి హిట్ అంటున్నారు.

ఇంట్రో, ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు. అనసూయకైతే కెరీర్‌లోనే ది బెస్ట్ అంటున్నారు. ఆమె నటన అద్భుతమని ప్రశంసలు కురిపిస్తున్నారు. కామెడీ కూడా చాలా బాగుందట.

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

ఇక మిక్కీ బీజీఎం, ఛోటా కెమెరా వర్క్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. కొన్ని ఫ్రేమ్స్, షాట్స్ చూస్తే ఛోటాను ఎంత అభినందించినా తక్కువే అంటున్నారు.

ఒకరైతే సినిమాలో వాయిలెన్స్ బీభత్సంగా ఉందని ట్వీట్ చేశారు. తెగిన తలలు – 2, పోయిన కాళ్లు చేతులు ఎన్నో అట. నరుకుడు అన్‌లిమిటెడ్ అని.. రక్తం ఏరులై పారించారంటూ లెక్కలతో సహా చెబుతున్నారు. మొత్తానికి ఒక మంచి పొలిటికల్ డ్రామా అంటున్నారు.

ఇవీ చదవండి:

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..