త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

అందరు హీరోయిన్లు వేరు.. కంగనా రనౌత్ వేరు. అమ్మడికి గొడవలు, కాంట్రవర్సీలతోనే కడుపు నిండుతుందో ఏమో కానీ తరచూ ఉండాల్సిందే. అసలు సాధారణంగా హీరోయిన్లు ఏదో సినిమా చేసేసి రెమ్యూనరేషన్ తీసుకుని మహా అయితే మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొని సైడ్ అయిపోతారంతే. కంగనా మాత్రం నిత్యం వివాదాలతోనే జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ అయిపోయిందట. 

2006లో బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కంగనా. టాలీవుడ్‌లో రాణించలేకపోయింది కానీ బాలీవుడ్‌లో మాత్రం ఓ రేంజ్‌కి వెళ్లింది. అమ్మడికి నటన పరంగా నూటికి నూరు మార్కులు పక్కా. హిందీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మంచి స్టార్‌డమ్‌ను తెచ్చుకుంది. . హృతిక్‌ రోషన్‌తో రిలేషన్, ఖాన్ త్రయంపై కామెంట్స్.. పొలిటికల్‌గా కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయి కామెంట్స్ పాస్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ఇంతకీ కంగనా పెళ్లి ఎప్పుడు చేసుకోబోతోంది? ఎవరిని చేసుకోబోతోంది? అంటారా? కంగనా పెళ్లి గురించి తాజాగా సినీ విమర్శకుడు కేఆర్‌కే ఓ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ ప్రకారం.. త్వరలోనే కంగన ప్రముఖ బిజినెస్ మెన్‌ను పెళ్లి చేసుకోబోతోందని వెల్లడించారు. డిసెంబర్‌లో నిశ్చితార్థమని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరగనుందని వెల్లడించారు. కేఆర్‌కే ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి:

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

Google News