పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం వింత వింత టాస్కులతో చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం పవర్ అస్త్ర కోసం పెద్ద వారే జరిగింది. ఒకరిని మించి ఒకరు పెర్ఫార్మ్ చేశారు. పవర్ అస్త్రలో భాగంగా జరిగిన బ్యాంకర్స్ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అంతా చాలా కష్టపడి ఆడారు. ఈ టాస్క్ ముగిసే సమయానికి  ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఎక్కువ బీబీ కాయిన్స్ సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరూ కంటెండర్స్‌గా నిలిచారు. 

ఇక మూడో కంటెండర్ ఎంపిక కోసం ఎవరి టాలెంట్‌ను వారే నిరూపించుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్స్ అంతా క్రియేటివ్‌గా ఆలోచించాలని.. విచిత్రమైన గెటప్ వేసుకుని.. అందరినీ నవ్వించాలని సూచించారు. ఇక కంటెస్టెంట్స్ అంతా ఎవరికి నచ్చినట్టుగా వారు రెడీ అయ్యారు. గాలా ఈవెంట్ హోస్ట్స్‌గా శోభా శెట్టి, ఆట సందీప్.. గెస్ట్‌గా శివాజీ వ్యవహరించారు. కంటెస్టెంట్స్ అంతా ఓ రేంజ్‌లో అలరించడానికి ట్రై చేశారు.

గతంలో కంటెండర్‌షిప్ కోసం గుండు చేయించుకునేందుకు ఇష్టపడని అమర్‌దీప్ ఈ వారం అరగుండు గీయించుకుని, మీసం కూడా సగం తీసేసి.. సగం అమ్మాయి, సగం అబ్బాయి గెటప్‌లో రెడీ అయ్యాడు. కానీ అంతగా ఎంటర్‌టైన్ చేయలేకపోయాడు. ఈ ఈవెంట్‌లో కాస్త బెటర్‌గా శుభశ్రీ చేసిందనిపించడంతో హోస్ట్‌లు, గెస్ట్ కలిసి ఆమె పేరు చెప్పారు. అమర్‌దీప్ త్యాగం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో అమర్‌దీప్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శుభశ్రీ చేసింది బాగోలేదంటూ రెచ్చిపోయాడు.

ఇవీ చదవండి:

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

Google News