త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

సినీ ఫైనాన్సియర్ కూతురుతో శింబు పెళ్లి

కోలీవుడ్ హీరో శింబుకి 40 ఏళ్లు. మోస్ట్ వాటెండ్ బ్యాచ్‌లర్స్‌లో ఈ హీరో కూడా ఒకడు. నటుడిగా.. సింగర్‌గా అద్భుతమైన ప్రయాణం సాగిస్తున్న శింబు.. అఫైర్స్‌కి దగ్గరగా.. పెళ్లి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇంతకాలం లవ్ అఫైర్స్‌తోనే కాలం గడిపేశాడు. శింబు లవర్స్ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. నయనతార, త్రిష, హన్సిక ఇలా చాలా మందే ఉన్నారు. అయితే ఎవరితోనూ పెళ్లి పీటలెక్కేందుకు శింబు ఆసక్తి చూపించలేదు. 

ఈ కారణంగానే లవ్ అఫైర్స్‌లో ఏ ఒక్కటి పెళ్లి పీటలెక్కలేదని టాక్. అలాంటి శింబు త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నాడట. శింబు తండ్రి రాజేందర్ కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో సమయం వచ్చినప్పుడు శింబూ పెళ్లి జరుగుతుందని వెల్లడించారు. అయితే గత రెండు నెలలుగా ఏం లీక్స్ వచ్చాయో తెలియదు కానీ శింబు పెళ్లి టాపిక్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ టాక్ నడుస్తోంది.

ఇటీవల శింబు తండ్రి రాజేందర్ అనారోగ్యం పాలవడంతో ఆయనకు విదేశాల్లో చికిత్సను అందిస్తున్నారు. ఈ సమయంలో శింబు పెళ్లి వార్తలు వైరల్ అవడంతో.. ఆయన తండ్రి చెప్పినట్టుగా పెళ్లికి సమయం వచ్చేసిందని నెటిజన్లు అంటున్నారు. శింబుకి కాబోయే భార్య.. చెన్నై కి చెందిన ఓ సినీ ఫైనాన్సియర్ కూతురట. ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయట. త్వరలోనే నిశ్చితార్థం.. ఆ వెంటనే పెళ్లి అనే టాక్ నడుస్తోంది.

ఇవీ చదవండి:

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..