మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకుడు సుకుమార్ హవా నడుస్తోంది. ఆయనే కాదు.. ఆయన శిష్యులు తీసిన సినిమాలు సైతం అద్భుత హిట్ సాధిస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీ మొత్తం సుక్కు చుట్టే తిరుగుతోంది. తొలుత రామ్ చరణ్‌తో రంగస్థలం మూవీ చేసి.. ఆయనను ఊర మాస్ గెటప్‌లో చూపి సుక్కు సక్సెస్ అయ్యారు. ఆ సినిమాకు ముందు అంతటి మాస్ గెటప్‌కు చెర్రీ సెట్ అవుతాడా? అన్న అనుమానం ఉండేది.

సినిమా చూశాక.. ఆ గెటప్‌కు చెర్రీ తప్ప మరెవరూ సూట్ కారేమో అనిపించింది. అంతలా చెర్రీని చూపించారు సుక్కు. ఇక ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ మూవీ మొదలు పెట్టారు. చెర్రీ అయితే ఓకే కానీ ఇంత మాస్ గెటప్‌కు బన్నీ ఎలా సెట్ అవుతాడని అనుకున్నారు. కానీ ఆ సినిమాతో బన్నీ ఏకంగా నేషనల్ అవార్డ్ కొట్టాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

దెబ్బకు బన్నీ పాన్ ఇండియా స్టార్స్ సరసన చేరిపోయాడు. ఇక ఇప్పుడు సుక్కు, బన్నీ కాంబోలో ‘పుష్ప2’ రూపొందుతోంది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత సుక్కు తన నెక్ట్స్ సినిమాను కూడా ఫిక్స్ చేసేశారట. అది కూడా రామ్ చరణ్‌తో. ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమా రంగస్థలంకు సీక్వెల్‌గా రానుందా? లేదంటే మరో సినిమానా అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా వీరిద్దరి కాంబో అంటే ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఇవీ చదవండి:

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..