Yatra2 Teaser: ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

ఏపీలో రాబోయే ఎన్నికలకు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న వైసీపీకి మేలు చేసేందుకు వర్మ ఓ సినిమాని, మహి వి రాఘవ్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ కాంట్రవర్సీ కోరల్లో చిక్కుకుంటే.. మహి వి రాఘవ్ మాత్రం.. ఎవరికీ దొరకకుండా తన పంథాలో మరోసారి యాత్ర కొనసాగించాడు. ‘యాత్ర 2’ పేరుతో ‘యాత్ర’కి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే వర్మకి, మహికి.. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనబడుతోంది. ఆ తేడా ఏంటంటే.. వర్మ, తన సినిమాలోని పాత్రల కోసం సేమ్ టు సేమ్ అలా ఉండేవారిని వెతికి పట్టుకొచ్చి నానా హంగామా చేస్తే, మహి మాత్రం పాత్రలకు టాలెంటెడ్ నటులని సెట్ చేయడం హైలెట్ అని చెప్పుకోవాలి. అలాగే ఎలాంటి కాంట్రవర్సీలకి తావు ఇవ్వకుండా.. వైఎస్ జగన్‌కు మేలు చేసేలా ‘యాత్ర 2’ని మహి తెరకెక్కించాడనేది ఈ టీజర్‌లో అడుగడుగునా కనిపిస్తోంది.

టీజర్‌ విషయానికి వస్తే… వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి గల కారణాన్ని ప్రేక్షకులకు టచ్ అయ్యేలా టీజర్ మొదలైంది. తన తండ్రి చనిపోయిన తర్వాత సొంతగా పార్టీ పెట్టడం, తన తండ్రిలానే ఓదార్పు యాత్ర మొదలెట్టడం వంటి అంశాలను చూపిస్తూనే.. దానికి నాటి రాజకీయ నాయకులు ఎలా అడ్డుపడ్డారనే విషయాన్ని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులను దాటుకుని వైఎస్ జగన్ ఎలా తన యాత్రని కొనసాగించాడు? తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగాడు? అనేది ఈ చిత్రంలో చూపించినట్లుగా టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజకీయ ముఖచిత్రం ఎలా మారిందనేది డైరెక్టర్ మహి ఇందులో చూపిస్తున్నాడు.

ఇక ఇందులో వైఎస్ జగన్ పాత్రకి జీవా పర్ఫెక్ట్ అన్నట్లుగా ఉన్నారు. డబ్బింగ్ విషయంలో కూడా అనుకరించాలని ప్రయత్నించకుండా.. సహజంగా వెళ్లడం గమనించవచ్చు. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ వంటి వారిని సెలక్ట్ చేసిన తీరుకి మహిని అభినందించకుండా ఉండలేరు. మొత్తంగా అయితే.. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సినిమా ప్రచారం అస్త్రంగా ఉపయోగపడే కంటెంట్ అయితే ఇందులో ఉందనేది ఈ టీజర్‌తోనే తెలిసిపోతోంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా ఈ ‘యాత్ర 2’ సినిమాని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఈ టీజర్‌లో ప్రకటించారు.

ఇవీ చదవండి:

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

Sootiga Team

Recent Posts

‘Mr Bachchan’ has sizzling romance between lead pair

Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…

August 2, 2024

తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…

August 2, 2024

Congress to move privilege motion against PM Modi

The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…

July 31, 2024

మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…

July 31, 2024

తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…

July 31, 2024

అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…

July 31, 2024