సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

సూపర్‌స్టార్ మహేష్ బాబు.. అందంలో మన్మథుడన్న విషయం తెలిసిందే. కాస్త పాష్‌గా చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ ఫిగర్. దాదాపు ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా కూడా కాలేజ్ స్టూడెంట్‌లా కనిపిస్తాడు. హైట్, కలర్, చార్మ్‌తో అమ్మాయిలను తెగ ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్.. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడనే విషయం తెలిసిందే.

రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో మహేష్ మూవీ రూపొందనుంది. తాను ఏ హీరోతో సినిమా చేయాలనేది ముందుగానే డిసైడ్ అయిపోయి ఆ హీరోకి తగ్గట్టుగానే రాజమౌళి కథను రాయించుకుంటారు. ఈ క్రమంలోనే మహేష్ కట్ అవుట్ కి సరిపోయేలా హాలీవుడ్ రేంజ్ సబ్జెక్టును ఎంచుకున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన లీకుల ప్రకారం.. ఈ సినిమాలో మహేష్.. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపించనున్నాడు.

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

ఇండియానా జోన్స్ ని తలపించేలా జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా రాజమౌళి, మహేష్ కాంబోలో మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్‌పై ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. తాజాగా మహేష్.. బ్లాక్ కలర్ సూట్‌లో హాలీవుడ్ హీరోలా కనిపించి మెస్మరైజ్ చేశాడు. దీంతో ఆ లుక్ రాజమౌళి సినిమా కోసమేనంటూ టాక్ మొదలైంది. అయితే మహేష్ ఓ యాడ్ కోసం అలా రెడీ అయ్యారని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు