శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవును.. స్టార్ డైరెక్టర్ శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మరోసారి అలకబూనారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ విషయంలో ప్రతిసారి మెగాభిమానులకు నిరాశే ఎదురవుతోంది. అందుకే అడుగడుగునా డిసప్పాయింట్ అవుతున్న పరిస్థితి.

అటు శంకర్ కానీ.. ఇటు నిర్మాత దిల్ రాజు కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా చేతులెత్తేశారు. దీంతో అసలు సినిమా షూటింగ్ సంగతేంటి..? రిలీజ్ ఎప్పుడు..? సినిమా ఉందా లేదా అన్నట్లుగా అభిమానులు నిరాశలో ఉన్నారు. మరోవైపు.. ఈ సినిమా విషయంలో రోజుకో పుకారు షికారు చేస్తుండటంతో ఏమీ అర్థం కాని పరిస్థితి.

టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ వచ్చే ఏడాది ఉండకపోవచ్చని.. రానున్న 2025లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ మరింత నిరాశకు లోనవుతున్నారు. కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ఈ దసరాకు ఫస్ట్ సింగిల్ వస్తుందని మాత్రం తెలుస్తోంది. మరోవైపు ఇదంతా ఎవరో కావాలనే సృష్టిస్తున్న వార్తలేనని.. వైరల్ కావడానికి ఇలా వార్తలు పుట్టిస్తున్న వారిని నమ్మొద్దని సినిమా టీమ్ చెబుతోందట.

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అటు సినిమా ఎక్కడి దాకా వచ్చిందో తెలియక.. రిలీజ్ ఎప్పుడో, కనీసం ఫస్ట్ సింగిల్ ఎప్పుడనే దానిపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకపోవడంతో మెగాభిమానులు కన్నెర్రజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శంకర్, దిల్ రాజును తిట్టిపోస్తున్నారు. ఇలా చేస్తే ఏమైనా బాగుందా..? ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి మహాప్రభో అంటూ వేడుకుంటున్న పరిస్థితి. రెండేళ్లుగా ఎందుకిలా చేస్తున్నారు..? ఫస్ట్ సింగిల్ వదలడానికి ఇంత రాద్ధాంతం ఏంటి..? అయినా సినిమా టీమ్‌కు వచ్చిన ఇబ్బందేంటి..? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వార్తలు చూసిన తర్వాత.. మోగాభిమానుల డిమాండ్ మేరకు చిత్ర యూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి.

ఇవీ చదవండి:

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

Google News