విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎవరితో ప్రేమలో పడతారో.. ఎప్పుడు ఒక్కటవుతారో.. ఎన్నిరోజులు కలిసుంటారో.. ఎప్పుడు విడిపోతారో అర్థం కాని పరిస్థితి.! చూడముచ్చని జంట, నిండు నూరేళ్లు కలిసే ఉంటుందని అభిమానులు, సినీ ప్రియులు కలలు కన్న కొన్నిరోజులకే పెద్ద పెద్ద స్టార్లే విడాకులు తీసుకున్న పరిస్థితులు కోకొల్లలు. ఇదంతా బాలీవుడ్‌లో ఒకప్పుడు ఎక్కువగా కనిపించేది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది..

టాలీవుడ్ ఇందుకు ఏ మాత్రం తక్కువ కాదని గత రెండు, మూడేళ్లుగా జరిగిన విడాకులతో రుజువైంది. ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ సింగర్ గీతా మాధురి, నటుడు నందూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ సంతానం కూడా కలిగింది. అయితే కొన్ని గొడవల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో.. కొన్ని ప్రముఖ చానెళ్లలో.. ఇక వెబ్ సైట్లలో అయితే లెక్కలేనన్ని వస్తున్నాయి.

Advertisement

వాస్తవానికి టాలీవుడ్‌లో పెద్దింటి పిల్లలు, యంగ్ హీరోలు, స్టార్ హీరోలు సైతం విడాకులు తీసుకున్న పరిస్థితుల్లో.. గీతా మాధురి కూడా విడాకులు తీసుకోబోతున్నారని.. మనస్పర్థల కారణంగానే ఇద్దరూ విడిపోతున్నారని టాక్ నడిచింది. ఇదే నిజమని ఆ ఇద్దరి వీరాభిమానులు, సినీ ప్రియులు అనుకున్నారు కూడా. పైగా కొంత కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ అటు గీతా నుంచి.. ఇటు నందూ నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో పక్కా విడాకులే అని అందరూ అనుకున్నారు. అయితే.. ఎట్టకేలకు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన నందూ ‘మాన్షన్-24’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

తాము విడాకులు తీసుకుంటున్నామన్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదు.. అదంతా అబద్ధమేనని కొట్టిపారేశారు నందూ. కుప్పలు తెప్పలుగా వస్తున్న ఈ వార్తలను చూసి గీతా మాధురి తాను నవ్వుకున్నామని చెప్పుకొచ్చారు. తాము ఇలాంటి వార్తలను ఎప్పుడూ పట్టించుకోమని.. చాలా హ్యాపీగా ఉన్నామని క్లారిటీ ఇచ్చుకున్నాడు. విడాకులు తీసుకుంటున్నారని ఎవరో ఏదో రాసినంత మాత్రాన తాము స్పందించాల్సిన అవసరం లేదని కూడా నందూ చెప్పుకొచ్చారు. రోజు రోజుకూ తమపై వార్తలు పెరిగిపోతుండటంతో ఇలా స్పందించాల్సి వచ్చిందని.. గీతా భర్త చెప్పుకొచ్చారు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వార్తలు పుట్టుకొస్తాయేమో చూడాలి మరి.

ఇవీ చదవండి:

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..