వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీదే హవా. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది హీరోలు మరే ఫ్యామిలీ నుంచి రాలేదు. అలాగే ఆ రేంజ్‌లో సక్సెస్ దాదాపు ఏ ఫ్యామిలీకి లేదు. ప్రస్తుతం చర్చ అంతా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించే జరుగుతోంది. వీళ్ల పెళ్లి ఎక్కడ జరుగుతుందో అనే విషయంలో క్లారిటీ వచ్చింది కానీ పెళ్లి డేట్ ఎప్పుడు అనేది తెలియరాలేదు.

తాజాగా ఈ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. వరుణ్ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో అభిమానుల కోసం పెట్టారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. అక్టోబర్ 27న మెగా ఫ్యామిలీ ఇటలీకి పయనం కానున్నట్టు తెలుస్తోంది. ఇక అక్టోబర్ 30 నుంచి పెళ్లి వేడుక ప్రారంభం కానుంది.

Advertisement

ఇక శుభలేఖలో వరుణ్ తేజ్ వాళ్ల నానమ్మ, తాతయ్యలతో పాటు పెదనాన్న, పెద్దమ్మలు చిరంజీవి, సురేఖ, బాబాయి పవన్ కల్యాణ్.. అలాగే రామ్ చరణ్, ఉపాసనల పేర్లను హైలైట్ చేశారు. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. పెళ్లి పెద్దలుగా రామ్ చరణ్, ఉపాసన వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరూ పెళ్లి పనులు చూసుకునేందుకు ఇటలీ వెళ్లినట్టు సమాచారం. ఇక ఈ పెళ్లికి పవన్ కల్యాణ్ హాజరవుతారా? లేదా? అనేది తెలియరాలేదు. రాజకీయ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉన్నందున పెళ్లి హాజరుకావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి:

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?