చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

మెగాస్టార్ చిరంజీవికి ఉన్నంత క్రేజ్ ఇండస్ట్రీలో మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆరు పదుల వయసులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు బీభత్సంగా ఉంది. వారసులు వచ్చినా కూడా ఆయన తరువాతే ఎవరైనా. ఇక ఆయన హీరోగా రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం గత సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. చిరుకు మాస్ మహారాజ్ రవితేజ కూడా తోడవడంతో ఈ మల్టీస్టారర్ మూవీ అదరగొట్టింది.

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ‘వాల్తేరు వీరయ్య’ దసరా సందర్భంగా బుల్లితెరపై ప్రసారమైంది. చిరు సినిమా అంటే థియేటర్లతో పాటు బుల్లితెరపై సైతం అదిరిపోయే రేటింగ్‌ను కైవసం చేసుకుంటుంది. కానీ ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్ మాత్రం షాక్ ఇచ్చాయి. జెమినీ టీవీలో ప్రసారమైన ఈ చిత్రం కేవలం 5.14 టీఆర్పీ రేటింగ్‌ను మాత్రమే రాబట్టింది.

మల్టీ స్టారర్, ఇద్దరు ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ సినిమాకు ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఓటీటీలో ఇప్పటికే విడుదలై మంచి రేటింగే సాధించింది. కానీ బుల్లితెరపై మాత్రం వెనుకబడిపోయింది. ఇక రూరల్‌లో అయితే మరింత రేటింగ్ పడిపోయింది. అర్బన్‌లో 5.14 రేటింగ్ కాగా.. రూరల్‌లో 4.56 మాత్రమే రేటింగ్ వచ్చింది. అయితే ఓటీటీలో ఇప్పటికే అంతా చూసి ఉండటం వలన సినిమాకు పెద్దగా రేటింగ్ దక్కలేదని అంతా అనుకుంటున్నారు.

ఇవీ చదవండి:

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

Google News